నిజామాబాద్‌కు చెందిన నిరుపేద బాలింతకు మెరుగైన వైద్య సదుపాయం అందించి పునర్జన్మ కల్పించారు మాజీ ఎంపీ కవిత. వారం రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన ఆర్తి డెలివరీ నిమిత్తం అక్కడ ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చేరింది. అక్కడి వైద్యులు డెలివరీ చేయడంతో ఆర్తి కవలలకు(ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చింది.
డెలివరీ తర్వాత మూడు రోజులకు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన ఆర్తికి తీవ్రమైన ఫిట్స్ రావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఫిట్స్ తీవ్రత ఎక్కువ ఉండటంతో మెదడులో రక్తం గడ్డకట్టి తీవ్ర ఆనారోగ్యానికి గురైంది. దీనితో నిజామాబాద్‌లో ఆ మేరకు వైద్య సదుపాయం లేకపోవడం, ఆర్తిక స్తోమత కూడా లేకపోవడంతో ఆర్తి కుటుంబీకులు వెంటనే మాజీ ఎంపీ కవితను ట్విట్టర్ ద్వారా సంప్రదించారు. ట్విట్ ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కవిత వెంటనే స్పందించారు.
ఈ నెల 9 వ తేదీన ఆర్దరాత్రి నిజామాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆర్తిని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడే మెరుగైన వైద్యం అందించడంతో పాటు డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆర్తి కోలుకునేలా చర్యలు చేపట్టారు. దీనితో ఐదు రోజుల చికిత్స అనంతరం ఆర్తి ఆరోగ్యం మెరుగవడంతో వైద్యులు సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా ఆర్తి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ కవిత చేసిన సహాయాన్నిమర్చిపోలేము అంటున్నారు.పెద్ద మనసుతో అర్దరాత్రి స్పందించిన కవిత రుణం తీర్చుకోలేము అంటున్నారు.బాలింత ఆర్తి కి కవిత పునర్జన్మ కల్పించింది అని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.
Pls send me the contact details !! Will do my best !! https://t.co/95ZiuMMe6e
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 8, 2020