సోంత ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది- కేసీఆర్

252
- Advertisement -

మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి ఇవాళ మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, సందీప్ రెడ్డి టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.

ఉమామాధవరెడ్డితోపాటు ఆమె అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు రెండువేలమంది టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 Former TDP minister Uma Madhav Reddy to join TRS

ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్‌ ఉమా మాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం సోంత ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. 1985లో తాను, మాధవరెడ్డి ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణకు సరిగ్గా నిధులు రాకపోతే..తాను, మాధవరెడ్డి కలిసివెళ్ళి ముఖ్యమంత్రితో నిధుల కోసం మాట్లాడేవాళ్ళమని అన్నారు.

చంద్రబాబు కరెంట్‌ ఛార్జీలు పెంచినప్పుడు తనత పాటు మాధవరెడ్డి చంద్రబాబును వ్యతిరేకించారన్నారు . కాగా..రాష్ట్ర్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పిన కేసీఆర్‌…జనవరి 1 నుంచి రైతులతోపాటు ప్రజలందరికీ 24 గంటల కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి నియోజక వర్గంలో అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందిస్తామన్నారు. కాగా..  తోబుట్టువులాంటి ఉమా మాధవరెడ్డికి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డికి కూడా టీఆర్‌ఎస్‌ లో మంచి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.

- Advertisement -