టీఆర్‌ఎస్ నేత,మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామికి టీఆర్‌ఎస్ నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివేక్ పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఎర్పట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయనను కాకుండా చివరి నిమిషంలో పార్టీలో చేరిన బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో వివేక్ ఆయన అనుచరులు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో వివేక్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే వివేక్ బీజేపీలో చేరతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో ఇప్పటికే ఆయన టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ తన ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచింది. రామ్‌మాధవ్‌తో వివేక్ చర్చిస్తున్న కారణంగానే బీజేపీ ఈ సీటుపై ఆచితూచి అడుగులు వేసిందని తెలుస్తోంది. మరి వివేక్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతారా లేదా.. అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.