- Advertisement -
ఆషాడం మాసం సందర్భంగా సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈసందర్భంగా నేడు అమ్మవారిని దర్శించుకున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆదివారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న ఆమె అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాంకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ జగన్నాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు.
- Advertisement -

