కాంగ్రెస్ కు షాక్ …టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్సీ

228
arikela narsa Reddy Trs
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వలసలకు బ్రేక్ వేయలేకపోతుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కాంగ్రెస్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సారెడ్డి ఈరోజు తెలంగాణ భవన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

అనంతరం అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను తనను ఆకర్షించాయని అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణలో నేను సీఎం కేసీఆర్ గారితో నడవాలనుకుంటున్నాని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు సాధిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -