చెన్నూరు బాల్కసుమన్‌దే:ఓదేలు

289
Nallala Odelu
- Advertisement -

చెన్నూరులో బాల్క సుమన్‌దే గెలుపని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఓదేలు…బాల్క సుమన్ గెలుపుకోసం అంతా కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు అంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు.

తనకు ఎలాంటి అన్యాయం జరగదని…పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ మాటే శిరోధార్యమని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.2001 నుంచి పార్టీ కోసం నిబద్దతతో పనిచేశానని…కేసీఆర్‌తో జీవితకాలం పనిచేస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని…ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

మరోవైపు పార్టీ అభ్యర్థులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు కేసీఆర్. ఒక్కో అభ్యర్ధితో స్వయంగా 4 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్…అసంతృప్తులను బుజ్జగించే పనిని తనకు వదిలేయాలని సూచించారు. కొత్తగా ఓటర్లను చేర్పించడం,పొలింగ్ బూత్‌ స్ధాయి కమిటీల్లో బలమైన నేతలు ఉండేలా చూసుకోవాలని కోరారు.

- Advertisement -