మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది సికింద్రాబాద్ సివిల్ కోర్టు. అనంతరం జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్‌పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు
నమోదు చేశారు.
14 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లేందుకు జగ్గారెడ్డి తనతో పాటు భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో మొత్తం నలుగురికి పాస్‌పోర్టులు, వీసాలు తీసుకున్నారు. అయితే, తిరుగు ప్రయాణంలో అమెరికా నుంచి ఆయన ఒక్కరే వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. గుజరాత్ పోలీసులు అందించిన సమాచారంతో మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు.
తాను చేసింది తప్పేనని జగ్గారెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. జగ్గారెడ్డి తన కుటుంబసభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పారు. డాక్యుమెంట్లలో భార్య ఫొటో, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డిల పుట్టినతేదీ మార్పిడి చేసి గుజరాత్‌కు చెందిన వేరే వారిని అమెరికాకు తరలించారని చెప్పారు.