పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

388
Pawan Kalyan Ravela
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ బాబు. అసలు పవన్ కళ్యాణ్ లో నాయకత్వ లక్షణాలు లేవని చెప్పారు. జనసేన పార్టీకి సిద్దాంతాలు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో తన అభిప్రాయాలను పవన్ ఎన్నడూ గౌరవించలేదన్నారు. పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

పార్టీని నడపడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అభిప్రాయపడ్డారు కిషోర్ బాబు. పార్టీ బలోపేతం గురించి పవన్ నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడుతుందన్నారు.

కాగా గత ఎన్నికల ముందు రావెల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇటివలే జరిగిన ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన మెదీ సమక్షంలో బీజేపీలో చేరారు. రావెల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఎవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -