- Advertisement -
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో ఇవాళ ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాల మధ్య షీలా దీక్షిత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఇవాళ ఉదయం షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
- Advertisement -