- Advertisement -
సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో గొగోయ్ ను రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ను విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ లో జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ పొందారు.
రంజన్ గొగోయ్ పదవి విరమణ చేసే సమయంలో పలు కీలక తీర్పులు ఇచ్చారు. అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, శబరిమల మహిళల ప్రవేశంపై రంజన్ గొగోయ్ కీలక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -