పళ్ళు పచ్చగా ఉంటే..సింపుల్ చిట్కా!

54
- Advertisement -

చాలామందికి దంత సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా దంతాలు పచ్చగా ఉండడం లేదా గార పట్టి ఉండడం చాలామందిని ఇబ్బంది పెట్టె సమస్యలు. ఈ విధంగా ఉన్నవారు నలుగురితో కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు. మనస్ఫూర్తిగా నవ్వలేరు.. ఎందుకంటే దంతాలపై ఉండే గార కారణంగా ఎదుటివారిలో అసంబద్ద భాగాన కలుగుతుంది. తద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తరచూ బ్రేస్ చేయడం రకరకాల బ్రేష్ లు వాడడం వంటివి చేస్తుంటారు అయినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించదు. అయితే కొన్ని సీపుల్ చిట్కాల ద్వారా పచ్చగా ఉన్న దంతాలను లేదా గార పట్టిన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ చిట్కాలు చూద్దామా..!.

బేకింగ్ సోడా గురించి మనందరికి తెలిసే ఉంటుంది. వంటింట్లో వివిధ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే చర్మ సౌందర్యన్ని పెంచే మెడిసన్స్ లో కూడా బేకింగ్ సోడా వాడుతూ ఉంటారు. కాగా బేకింగ్ సోడా పంటి గార ను పోగొట్టడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని, అందులో మరోస్పూన్ నిమ్మరసం కలిగి ఆ మిశ్రమాన్ని దంతాలకు రుద్దితే పంటిపై ఉండే గార పసుపు రంగు పోయి.. దంతాలు తెల్లగా మారతాయి.

Also Read:జగన్ బాధితులకు బాబు ఆహ్వానం

ఇంక దంతాలపై ఉండే పచ్చ రంగును పోగొట్టడంలో తొలసి ఆకులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. తొలసి ఆకులను ఎండ లో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకొని ప్రతిరోజూ ఉదయం బ్రేష్ చేసేటప్పుడు పేస్ట్ తో పాటు ఆ పొడిని కలుపుకొని రుద్దితే.. ఎటువంటి దంత సమస్యలైన దురమౌతాయి. పంటిపై ఉండే పాచి, గార వంటివి పోయి దంతాలు తెలుపుదనాన్ని సొంతం చేసుకుంటాయి. ఇంకా దంతాలను తెల్లగా మార్చడంలో ఉప్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉప్పులో ఉండే సోడియం దంతాలపై ఉండే పసుపు రంగును పోగొడుతుంది. ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని దంతాలకు రుద్దాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే గార, పసుపు రంగు దూరమై ఆకర్షణీయమైన తెలుపు రంగుతో దంతాలు అందంగా కనిపిస్తాయి.

Also Read:ఎసిడిటీ సమస్యా..ఇలా చేయండి!

- Advertisement -