కంటి చూపు కాపాడుకోండిలా!

188
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న కాలక్రమేనా వాతావరణంలోను మన జీవన విధానంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాతావరణంలోని పరిస్థితులు, కాలుష్యం ఇంకా మన జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, ఇలా చాలా వాటి వల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా తలెత్తుతు ఉంటాయి. అయితే మిగతా సమస్యల గురించి అటుంచితే ఈ రోజుల్లో ప్రతిఒక్కరికి కంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే కంటి సమస్యలు పెరగడానికి కూడా కారణం లేకపోలేదు. పని భారంతో అధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ తో కాలక్షేపం చేయడం, వంటి అలవాట్ల కారణంగా అధిక ప్రభావం కంటి పైనే పడుతుంది. ఫలితంగా చూపు మందగించడం, లేదా కంటిలో శుక్లలు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇంకా ఒత్తిడి, నిద్ర లేమి, వంటి వాటి వల్ల కూడా కంటి సమస్యలు పెరగడానికి కరణమౌతున్నాయి. అయితే శరీరానికి వెలుగునిచ్చే కంటిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతిఒక్కరిది. కొన్ని సాధారణ చిట్కాల ద్వారా కంటి సమస్యలు చాలా వరకు దూరం చేయవచ్చు అవేంటో చూద్దాం !

ముఖ్యంగా కంటికి మేలు చేసే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు, చేపలు వంటి వాటిని బాగా తినాలి. ఎందుకంటే ఆకు కూరల్లో యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వీటివల్ల కంటి సమస్యలు తగ్గడంతో పాటు కన్ను ఆరోగ్యంగా ఉండానికి సహాయపడతాయి. అలాగే విటమిన్ సి ఉండే పదార్థాలు అనగా నిమ్మరసం ఆరెంజ్ రసం వంటివి కూడా కంటిచూపు ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇక శరీరనికి తగినంతా విశ్రాంతిని ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ప్రశాంతగా తగినంత సమయం నిద్ర పోవడం వల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. అందువల్ల చాలా మంది ఎదుర్కొనే కళ్ల మంట తగ్గుతుంది.

Also Read: బాబోయ్.. బాలయ్యతో హాట్ బ్యూటీ

ఇక టి‌వి ముందు గాని లేదా కంప్యూటర్ కు గాని అతి దగ్గరగా కూర్చోకూడదు. టీవికీ కనీసం 3 మీటర్ల దూరం వహించాలని, కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కళ్ళకు ప్రొటెక్షన్ గ్లాసస్ వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బయటకు వెళ్ళే సమయంలో దుమ్ము ధూళి వంటివి కళ్ళకు హాని కలిగించే ప్రమాదం ఉంది. అలాగే సూర్య రశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా కళ్లపై పడే అవకాశం ఉంది. అందువల్ల బయటకు వెళ్ళే క్రమంలో తప్పని సరిగా కూలింగ్ గ్లాసస్ వాడడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి కనీసపు జాగ్రత్తలు పాటించడం వల్ల మన శరీరానికి వెలుగునిచ్చే కంటిచూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -