చాలమందికి శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తరచూ జ్వరం బారిన పడడం, లేదా విపరీతమైన తలనొప్పితో భాదపడడం, అలసటగా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాగా శరీరంలో వేడిశాతం ఎక్కువగా ఉన్నవారికి ఈ వేసవిలో ఆ సమస్య మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు వడదెబ్బ కు కూడా కరణం అవుతుంది. అంతేకాకుండా తరచూ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల శరీరంలో వేడిని తేలికగా తీసుకోకూడదు. అయితే బాడీలోని వేడిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలమంది. శరీరాన్ని తడిగుడ్డతో తుడవడం, లేదా ఏపీ రూమ్ లలో ఎక్కువగా గడపడం, వంటివి చేస్తుంటారు. ఇంకొందరైతే వైద్యుడిని సంప్రదించి తగిన మెడిసన్ వాడుతుంటారు.
అయితే శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వేడిని తగ్గించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగ పడతాయట. మెంతులలో విటమిన్ బి6, విటమిన్ సి, కాపర్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీర ఉష్ణోగ్రత ను క్రమబద్దీకరించడంలో సహాయపడతాయట. అందుకే వేడి అధికంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక రూపంలో మెంతులు తినే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక శరీరాన్ని కూల్ చేయడంలో సోంపు కూడా చాలా బాగా ఉపయోగ పడుతుందట. సోంపులో విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం లాంటివి ఉంటాయి. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ సోంపు గింజల పొడి, కాసింత పటిక బెల్లం వేసి ప్రతిరోజూ తాగితే శరీరంలోని వేడి తగ్గి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..