గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ కమిటీ ఛైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుకే రవిశంకర్ మరియు రాష్ట్ర నాయకులు జోగినిపల్లీ రవీందర్ రావు ఎంపీపీ పర్లపెళ్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ ఉమ కొండయ్య మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు..గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలలో రైతులకు రైతు బంధు రైతు భీమ ఇలాంటి మరెన్నో పథకాలతో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు అని అన్నారు. అనంతరం మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం , ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, జిల్లా నాయకులు అనుముల భాస్కర్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

