యంగ్ గా కనిపించాలంటే..ఇలా చేయండి!

29
- Advertisement -

నేటిరోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలమందిలో యంగ్ ఏజ్ లోనే వృద్దప్య ఛాయలు కనిపిస్తుంటాయి. చర్మం వదులుగా మారడం, మొఖం పై మొటిమలు రావడం, ముడతలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి కారణంగా వయసు తక్కువగా ఉన్నప్పటికి పెద్దవారిలా కనిపిస్తారు. అయితే యంగ్ ఏజ్ లోనే వృద్దప్య ఛాయలు రావడానికి కారణం శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ లోపం ఏర్పడడం. ఈ ప్రోటీన్ లోపం కారణంగానే పై సమస్యలన్నీ ఏర్పడతాయి. ఎముకలు, కండరాలు దృఢంగా మార్చడంలోనూ, జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో తగిన మోతాదులో కొల్లాజెన్ ఉండేలా చూసుకోవాలి. తద్వారా మూడు పదులు దాటిన యంగ్ గానే కనిపిస్తారు. అయితే శరీరంలోని కొల్లాజెన్ ను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం !

చర్మసంరక్షణ లోనూ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ విటమిన్ సి అనేది అత్యంత కీలకం. అందువల్ల విటమిన్ సి సీరం ను ప్రతిరోజూ ఫేస్ కు అప్లై చేయడం వల్ల ఇది అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. రెటీనోయిడ్స్ కూడా కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రోస్తహిస్తుంది. అంతేకాకుండా ప్రిరాడికల్స్ ను తొలగించి చర్మం బిగుతుగా మారెల చూస్తుంది. తద్వారా ముఖ్యంపై ముడతల సమస్య తగ్గుతుంది. ఇక తినే ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పడగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని త్రాగలి. ఇలా చేయడంవల్ల శరీరమంతట రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా ప్రతిరోజూ మనం తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మసంరక్షణకు ఎంతగానో సహాయ పడతాయి. ఇంకా అన్నిటికి కంటే ముఖ్యంగా యంగ్ గా కనిపించాలంటే శారీరక శ్రమ చాలా అవసరం. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే వృద్దప్య ఛాయలు దారి చేరవని నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR:మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే

- Advertisement -