రోజులు మారుతున్న కొద్ది మన అలవాట్లలో కూడా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే కల కృత్యాలు తీర్చుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఎంతో చురుకుగా, ఉల్లాసంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పడుకునే వరుకు బద్దకం, అలసట, నీరసం వంటి వాటితో రోజును గడిపేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే మన పనులు మనం చేసుకోవడానికి కూడా అలసటగా భావిస్తుంటాము. అయితే ఇవన్నీ దూరం చేసుకోవాలంటే రోజంతా యాక్టివ్ గా పని చేయాలంటే కొన్ని అలవాట్లు మనం అలవరచుకోవాలి. .
సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతిఒక్కరికీ కాఫీ లేదా టీ తాగే అలవాటు తప్పనిసరిగా ఉంటుంది. అయితే వీటికి బదులుగా నిమ్మరసం లేదా మంచినీళ్ళు తాగితే మరి మంచిదట. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం మలబద్దక సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇక మంచి నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని మలినాలు త్వరగా బయటకు పోయే వీలు ఉంటుంది. ఇక నేటిరోజుల్లో చాలమంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం అసలు మంచిది కాదు. కాబట్టి ఫోన్ చూడడానికి కేటాయించే టైమ్ లో వ్యాయామం చేయడం ఎంతో మేలు.. మనల్ని రోజంగా యాక్టివ్ గా ఉంచడంలో వ్యాయామం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
Also Read:KTR:జయశంకర్ సార్ విగ్రహాం ధ్వంసం..హీనమైన చర్య
కాబట్టి కనీసం 20 నుముషాలైనా వ్యయమనికి కేటాయిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక మరో 20 నిముషాలు పుస్తకాలు చదవడం, ద్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవడం మచిదట. ఇకపోతే చాలమంది ఉదయం ఎలాంటి బ్రెడ్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మద్యాహ్నం భోజనం చేసేస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా కొన్ని అలవాట్లు మనం ఉదయం అవలంభించుకుంటే రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.