రైటర్‌ కు ప్రాణహాని.. అటు క్షమాపణలు

49
- Advertisement -

ఆదిపురుష్ మూవీ వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ మూవీలో రామాయణంలోని పాత్రలను కించపరిచారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ సినిమాలోని కొన్ని డైలాగులపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ ఈ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసు అధికారులు స్పందించి ఆయనకు భద్రతను కల్పించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. అందరి ఫీలింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుని డైలాగ్స్‌ను మార్చాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారని చెప్పారు. కొత్త డైలాగులను ఈ వారంలో చేరుస్తామని అన్నారు.

మరోవైపు ఇండియన్ సూపర్ హీరో ‘శక్తిమాన్’ నటుడు ముఖేష్ ఖన్నా కూడా ఆదిపురుష్ చిత్ర బృందంపై సీరియస్ అయ్యారు. దర్శకుడు ఓం రౌత్‌కి ‘రామాయణం’ గురించి అసలు అవగాహన లేదు’ అని విమర్శించారు. ఇటు ‘ఆదిపురుష్’ సహ నిర్మాత టి-సిరీస్ సీతను ‘భారతదేశపు కుమార్తె’గా అభివర్ణించే డైలాగ్‌పై ఖాట్మండు మేయర్ బాలెన్ షాకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేసింది.

Also Read:సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

‘నేపాల్ ప్రజల మనోభావాలను గాయపరిచినట్లయితే.. క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు’ అని లేఖలో పేర్కొంది. ఖాట్మాండులో సినిమాపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. మొత్తమ్మీద ఆదిపురుష్ సినిమాకి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు సినిమా పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు.

Also Read:ట్రెండింగ్ లో ‘మెగా ప్రిన్సెస్’

- Advertisement -