ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే చర్యలు:సబర్వాల్

234
akun
- Advertisement -

సినిమా థియేట్స్‌,మల్టీప్లెక్స్‌ లలో ఆహార పదార్థాలను ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పారు అకున్ సబర్వాల్. మంగళవారం సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌ యాజమానులతో అకున్‌ సబర్వాల్‌ సమావేశం నిర్వహించారు. ప్యాకేజ్డ్‌ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సబర్వాల్‌ హెచ్చరించారు.

ప్రతిదానిపై బరువు,పరిమాణం , ధర స్పష్టంగా కనిపించేలా ఉండాలని తెలిపారు. అధిక ధరలు వసూలు చేస్తే వాట్సప్‌ నంబర్‌ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించిన స్టిక్కర్లు, అతికించుకోవచ్చన్నారు. సెప్టెంబర్ 1నుంచి పదార్థాలపై ఖచ్చితమైన ధర ముద్రించాలని నిర్దేశించారు.

మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం బయటి ఆహారపదార్థాలను లోపలికి అనుమతించాలని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.

- Advertisement -