డబ్బుల కోసం పనిచేయలేదు…

204
tabu-about-movies.
- Advertisement -

ట‌బు.. పేరు విన‌గానే ఎన్నో హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. నిన్నే పెళ్లాడ‌తా, కూలీ నెంబ‌ర్ 1 చిత్రాల్లో ట‌బు సోయ‌గాలకు ఫిదా అయిపోయారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ తదితర అగ్రహీరోల సరసన నటించింది టబు. ఆ త‌ర‌వాత బాలీవుడ్‌లోనూ అదే హ‌వా చూపించింది. టబును అప్పట్లో బాలీవుడ్ నటి అన్నారంతా. కానీ టాలీవుడ్ లో కూడా చేసి, నేను ఏ లాంగ్వేజ్ లో అయినా హిట్ అవుతాను అని ప్రూవ్ చేసుకుంది.

tabu-about-movies.

టబూ ఫిట్ నెస్ నేటికీ తగ్గలేదు. ఆమె ఇప్పటికీ తళుకులీనుతూనే ఉంది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, ఇప్పటివరకు నాకు వచ్చిన పాత్రల్లో అన్నీ మంచివే. . ఓ సినిమా ఒప్పుకునే ముందు నాకు డబ్బు వస్తుందా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తా. అది చాలా ముఖ్యం. డబ్బు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చేయను. ఆవిషయంలో ఎవ్వరికీ భయపడను’ అని చెప్పుకొచ్చింది టబు.

- Advertisement -