- Advertisement -
పార్టీలకు వేల రూపాయలు ఖర్చు చేసే మనం హెల్మెట్ కోసం ఓ వెయ్యి రూపాయలు ఖర్చు చేయకపోవడం బాధాకరం అన్నారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించారు సీతక్క.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. మన తప్పుల వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదు అని…ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలంటే అంతా రోడ్డు భద్రతను పాటించాలన్నారు.
ఆసీఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీతక్క. జంకాపూర్ గ్రామంలో బాల సదన్ కు భూమి పూజ, మోడల్ అంగన్వాడి కేంద్ర ప్రారంభోత్సవం జరుగగా వాంకిడి గ్రామంలో కేజీబీవీ జూనియర్ కాలేజీకి శంకుస్థాపన చేశారు సీతక్క. కెరామేరి మండలంలోని జోడేఘాట్ లో టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
Also Read:కౌశిక్ రెడ్డిపై కేసు
- Advertisement -