రాష్ట్రవ్యాప్తంగా కమ్ముకున్న దట్టమైన పొగమంచు

8
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా హైవేలపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున వేళ విజిబిలిటీ 10 మీటర్ల కంటే కూడా తక్కువకు పడిపోవడంతో ముందున్న వాహనాలు కనిపించక డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. చలి తీవ్రత కొంత తగ్గినప్పటికీ పొగమంచు మాత్రం వీడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.

హైవేలపై ఒకదానికొకటి వాహనాలు ఢీకొనే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ వాహనాలు, లారీలు, బస్సులు పొగమంచు కారణంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

పొగమంచు నేపథ్యంలో పోలీసులు, రవాణా అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్లు తక్కువ వేగంతో ప్రయాణించాలని, హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున, ఉదయం తొలివేళల్లో ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే రోడ్డు పక్కన అకస్మాత్తుగా వాహనాలను నిలపకూడదని, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. పొగమంచు పరిస్థితి పూర్తిగా తగ్గే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read:నాడైనా-నేడైనా..తెలంగాణకు కాంగ్రెస్‌ విలనే

- Advertisement -