తాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు బాలీవుడ్ నటీ కరీనాకపూర్. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తిలేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కరీనా ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని తనను ఎవరు సంప్రదించలేదన్నారు. కరీనా ప్రకటనతో కొద్దిరోజులగా జరుగుతున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టినట్లైంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి కరీనాకపూర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ స్ధానంలో బీజేపీని ఓడించాలంటే కరీనానే సరైన వ్యక్తని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత యోగేంద్ర సింగ్ చౌహాన్.. రాహుల్‌గాంధీకి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో కూడా చర్చించాలని ప్రయత్నిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. కానీ వాటన్నింటినీ కరీనా తోసిపుచ్చారు.