రైతులు, వలస కార్మికుల సంక్షేమానికి భారీ ప్యాకేజీ..

219
FM Says Nirmala Sitharaman relief measures for migrant workers
- Advertisement -

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ రెండో విడత ప్యాకేజీ వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.

పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు ప్యాకేజిలో పెద్దపీట వేశారని, వారి సంక్షేమం కోసం భారీగా కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు. వారి సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్ల కోసమే రూ.11,000 కోట్లు రాష్ట్రాలకు కేటాయించామని, నిత్యం మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వలస కార్మికులకు ఇప్పటికే నగదు పంపిణీ చేయడం కూడా జరిగిందని ఆమె వివరించారు.

తగ్గింపు రేట్లతో 3 కోట్ల మంది రైతులకు ఇప్పటికే రూ.4.22 లక్షల కోట్లు రుణాల రూపంలో అందజేశామని వెల్లడించారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నామని, కిసాన్ కార్డుదారులకు రూ.25 వేల కోట్ల రుణాలు తమ ప్రభుత్వ ఘనత అని నిర్మల పేర్కొన్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ప్రభుత్వం మార్చిలో రూ.29,500 కోట్లు రీఫైనాన్స్ చేసిందని అన్నారు.

ఈ రెండో ప్యాకేజి ముద్ర యోజన, గృహ కల్పన, ఉద్యోగ కల్పన రంగాలకు కూడా చేయూతనిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు రాయితీ పొడిగిస్తున్నట్టు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే అవకాశాలపైనా కేంద్రం ప్రత్యేకం దృష్టి సారించిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.12 వేల కోట్లు అందించామని, పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని అన్నారు.

12 వేల స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల మాస్క్‌లు, లక్షా 20 వేల లీటర్ల సానిటైజేషన్‌ తయారు చేశాయి. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేశాం. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పన బియ్యం, గోదుమలు, కిలో పప్పు పంపిణీ చేస్తున్నాం. రేషన్‌ కార్డులు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు, తీసుకోవచ్చు. వలస కార్మికులు ఎక్కుడన్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాలపంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు.

రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించాం. రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఆగస్టు నాటికి ఒకే దేశం… ఒకే కార్డు అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది. 2021 మార్చి 31 నాటికి వందశాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ చేస్తాం. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానం ప్రజా పంపిణీలో కొత్త విప్లవం తీసుకొస్తుందని మంత్రి పేర్కొన్నారు..

- Advertisement -