నేపాల్‌లో వరద బీభత్సం..

5
- Advertisement -

ప్రకృతి ప్రకోపానికి నేపాల్ విలవిలలాడింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి మృతిచెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు వరదలతో మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతుండగా గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

వరదలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బ తినగా 16 వంతెనలు కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రకటించారు. వేలాది మంది సహాయక చర్యల్లో నిమగ్నం కాగా భాగమతి నది అయితే ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.

Also Read:ఐఫా-2024 : ఉత్తమ చిత్రం దసరా

- Advertisement -