తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వినాయకస్వామి , చంద్రశేఖరస్వామి తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన వినాయకస్వామి , చంద్రశేఖరస్వామి కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా రెండవ రోజు సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు,మూడోరోజు సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదోరోజు చండికేశ్వరస్వామి , చంద్రశేఖర స్వామి తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
Also Read:KTR:ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ