- Advertisement -
రాష్ట్ర పేదరిక నిర్మూల సంస్థ( సెర్ప్)తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్. దీంతో ఇకపై మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ విక్రయించనుంది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో, ఫ్లిప్‌కార్ట్ ఉపాధ్యక్షుడు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతోపాటు వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల వస్తువులతోపాటు ఎఫ్‌పీవోలు సేకరించిన ధాన్యం కూడా ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో విక్రయించనుంది.
- Advertisement -