విమాన సర్వీసులపై కేంద్రం క్లారిటీ..

229
indigo
- Advertisement -

మే 4 నుంచి దేశీయ, జూన్ 1 నుండి ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో విమాన సర్వీసులపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

విమాన ప్ర‌యాణాల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు బుకింగ్స్ ప్రారంభించాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని అందువల్ల విమాన సర్వీసులపై ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు.

లాక్ డౌన్ కారణంగా విమానయాన సంస్థలకు రోజుకు కోట్లాది రూపాయల నష్టం వస్తోంది. దీంతో సర్వీసులు ప్రారంభించేందుకు పలు సంస్థలు ఆసక్తిచూపగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

- Advertisement -