Flavonoids:’ఫ్లెవనాయిడ్స్’ ఉపయోగాలు తెలుసా?

26
- Advertisement -

మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఫ్లెవనాయిడ్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచడంలో వీటి పాత్ర అధికం. ఫ్లేవనాయిడ్స్ మొక్కల నుంచి లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు.. ఇలా మొక్కల నుంచి వచ్చే పదార్థాలను తిన్నప్పుడు వాటి నుంచి ఫ్లెవనాయిడ్స్ మన శరీరానికి అందుతాయి. ఫ్లెవనాయిడ్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోని హానికరమైన వైరస్ లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా శరీరంలో హానికరమైన క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కూడా ఫ్లెవనాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. .

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఫ్లెవనాయిడ్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో సహాయ పడతాయి.. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, మధుమేహాన్ని నియంత్రించడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి ఫ్లెవనాయిడ్స్ కలిగిన పదార్థాలను తినడం ఆరోగ్యనికి ఎంతో మంచిది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లలో ఫ్లెవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి ఫలాలలో కూడా ఆమ్ల సంబంధిత ఫ్లెవనాయిడ్లు ఉంటాయి.

కాలీఫ్లవర్, బచ్చలి కూర, బ్రోకలి వంటి ఆకు కూరలలో కేంఫెరోల్ మరియు క్వెర్సెటిన్ వంటి ఫ్లెవనాయిడ్లు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇంకా ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే ఫ్లెవనాయిడ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. డార్క్ చాక్లెట్ లో కూడా ఫ్లెవానోడ్స్ అనే ఫ్లెవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. ఇంకా రెడ్ వైన్, గ్రీన్ టి వంటి పానియాలలో కూడా మన శరీరానికి అవసరమైన ఫ్లెవనాయిడ్లు లభిస్తాయి. కాబట్టి ఫ్లెవనాయిడ్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:వార్‌ 2..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -