సుప్రీంకోర్టుకు మరో 5గురు రెబల్ ఎమ్మెల్యేలు..

137
karnataka-mlas

కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ సుప్రింకోర్టును ఆశ్రయించగా..తాజాగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. . తమ రాజీనామాలను ఆమోదించేలా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.

తాజాగా అత్యున్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు సుధాకర్, రోషన్, నాగరాజు, మునిరత్నం కూడా ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని మొదట సుప్రీంను ఆశ్రయించిన ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే.