ఐదు మిస్టేక్స్‌ ఉన్నాయన్న దర్శకుడు..

166
Five mistakes in Baahubali
Five mistakes in Baahubali
- Advertisement -

బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు తిర‌గ‌రాస్తోంది. విడుద‌ల‌యిన ప్ర‌తీ చోటా త‌న‌దైన మార్కుతో స‌రికొత్త చ‌రిత్రను న‌మోదు చేస్తోంది. భాషా భేదాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా.. జ‌నాలు మాత్రం బాహుబ‌లి-2ను ఆద‌రిస్తున్నారు. సినీ ప్ర‌ముఖులు కూడా బాహుబ‌లి-2ను, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ మాత్రం బాహుబ‌లి-2లోని ఐదు త‌ప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అవి విమర్శలో.. పొగడ్తలో మీరే డిసైడ్ చేసుకోండి..

1. కేవలం 120 రూపాయలకే అద్బుత దృష్య కావ్యం ‘బాహుబలి’ని చూడాల్సి రావడమన్నారు. దీనికి పరిష్కారమేంటంటే, నిర్మాత కోసం థియేటర్ల వద్ద కలెక్షన్‌ బాక్స్‌.. లేదా నిర్మాతల అకౌంట్‌ నెంబర్.. లేదా వారి అడ్రస్‌ ఏర్పాటు చేయాల్సిందన్నారు.

2. సినిమా నిడివి చాలా తక్కువగా వుందన్నారు. కేవలం 3 గంటల్లో సినిమా పూర్తయిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

3. సినిమాలో టూమచ్‌ డిటెయిలింగ్‌ అండ్‌ పెర్‌ఫెక్షన్‌ ఉందన్నారు. ఈ దెబ్బతో, చాలామంది ఫిలిం మేకర్స్‌ తమ నమ్మకాన్ని, హెడ్‌వెయిట్‌ని తగ్గించుకునే అవకాశం వుందన్నారు.

4. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కంక్లూజన్‌ అవడానికి వీల్లేదన్న విఘ్నేష్‌.. సమీప భవిష్యత్తులో ఇలాంటి మరో పది సినిమాల్ని చూడాలనుకుంటున్నమన్నారు.

5. సినిమాకు భవిష్యత్‌ కష్టకాలమే. ఎందుకంటే, బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేయడం అంత తేలిక కాదు. భారతీయ సినీ పరిశ్రమలోఈ రికార్డుల్ని కొల్లగొట్టాలంటేచాలా ఏళ్ళు పడ్తుందన్నారు.

తమిళంలో స్టార్‌ దర్శకుడైన విఘ్నేష్ ఇలా క్రియేటివ్‌గా త‌న ప్ర‌శంస‌ల‌ను తెలియజేశాడు…

vignesh

- Advertisement -