“మహర్షి” ఫస్ట్ రివ్యూ

324
Maharshi Censor Review

సూపర్ స్టార్ మహేశ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. మహేశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు విడుదల కానుంది. మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈమూవీ యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈమూవీకి హైటెల్ గా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా విడుదలవుతుండటంతో దుబాయ్ లో తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది మహర్షి.

దుబాయ్ సెన్సార్ బోర్డులో పనిచేసే సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు గత కొంత కాలంగా రివ్వూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో విడుదలయిన చాలా సినిమాలకు ఆయన రివ్వూలు ఇస్తుంటారు. తాజాగా మహర్షి సినిమా చూసిన ఆయన రివ్యూ ఇచ్చారు. యూఏఈ సెన్సార్ బోర్డులో సినిమా చూసిన ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు ముందే రివ్యూ ఇచ్చారు. మహర్షి సినిమాకు ఆయన నాలుగు స్టార్లు వేశారు. ఈసందర్భంగా ఈవిషయాన్ని ఆయన తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. అన్ని అంశాలను కవర్ చేస్తూ మహర్షిని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. ఈసినిమాలో మహేశ్ బాబు నటన అద్భుతంగా ఉందని తెలిపారు.

మొత్తానికి ఈసినిమా పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పేర్కొన్నారు. ఉమైర్ సంధు. ఇక ఈ రివ్వూను చూసిన మహేశ్ అభిమానులు సంబురపడిపోతున్నారు. మహేశ్ బాబు ఖాతాలో మరో హిట్ ఖాయం అని ఫిక్స్‌ అయిపోయారు. అయితే ఉమైర్ సంధు గతంలో మహేశ్ బాబు నటించిన స్పైడర్ మూవీకి కూడా నాలుగు స్ఠార్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆమూవీ తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈమూవీ రేపు ఇండియాలో విడుదల కానుంది. ఈమూవీ కోసం మహేశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో టాప్ లో ఉన్న మహర్షి రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి.

https://twitter.com/UmairFilms/status/1125660773261434881