బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రీడాకారుల మీద ‘బాగ్ మిల్కా బాగ్’, ‘మేరీకోమ్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇటీవల మరాఠా యోధుడు పేష్వా బాజీరావు జీవిత కథ ఆధారంగా సంజరులీలా భన్సాలీ రూపొందించిన ‘బాజీరావు మస్తానీ’, కువైట్ – ఇరాక్ యుద్ధ సమయంలో దాదాపు లక్షాడబ్బై వేల మందిని కాపాడిని రంజిత్ కత్యాల్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ఎయిర్ లిఫ్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు . గతంలో మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేశారు.
To reinvent yourself as an actor is to challenge yourself. Looking forward to portraying #DrManmohanSingh in #TheAccidentalPrimeMinister.:) pic.twitter.com/PsVdkpjZWY
— Anupam Kher (@AnupamPKher) June 7, 2017
ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ రత్నాకర్ గుత్తే దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మన్మోహన్ పాత్రని బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. మన్మోహన్ సింగ్ జీవితంలో కీలక వ్యక్తులైన సోనియా గాంధీ, రాహుల్ పాత్రల కోసం అన్వేషిస్తున్నారు. ఆగస్ట్ 30వ తేదీన టీజర్ విడుదల కి ప్లాన్ చేస్తుండగా, ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో.. 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం.