‘జ‌ట్టు ఇంజ‌నీర్’ ఫ‌స్ట్ లుక్‌

252
- Advertisement -

హింద్ కా నాప‌క్ కో జ‌వాబ్ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత సెయింట్ డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ ఇన్‌సాన్‌(డా.ఎం.ఎస్‌.జి) `జ‌ట్టు ఇంజ‌నీర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. సోష‌ల్ మెసేజ్‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా `జట్టు ఇంజ‌నీరింగ్‌`. డా.ఎం.ఎస్‌.జి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా `జ‌ట్టు ఇంజ‌నీర్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

First Look of Jattu Engineer Released

ఎం.ఎస్‌.జి సిరీస్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద్వ‌యం డా.ఎం.ఎస్‌.జి, ఆయ‌న కుమార్తె హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌చేశారు. పేద‌రికం, నిరుద్యోగం, డ్ర‌గ్స్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడే గ్రామాన్ని ఓ ఉపాధ్యాయుడు ఎలా మార్చి ప్ర‌జ‌ల్లో ఎలాంటి మార్పు తెచ్చాడ‌నేదే క‌థ‌. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ మిష‌న్‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యుమ‌ర్‌తోపాటు ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుందని చిత్ర ద‌ర్శ‌కురాలు హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ తెలిపారు. ఈ చిత్రాన్ని 15రోజుల్లోనే చిత్రీక‌రించ‌డం విశేషం. డా.ఎం.ఎస్‌.జి న‌టిస్తున్న మ‌రో చిత్రం ఎం.ఎస్‌.జి ఆన్‌లైన్ గురుకుల్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రెండు పాట‌లుంటాయి. అందులో ఒక‌టి స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. ఈ రెండు సాంగ్స్‌ను డా.సెయింట్ డా.ఎం.ఎస్‌.జి కంపోజ్ చేసి పాడ‌టం విశేషం.

- Advertisement -