అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్

439
Akshay Kumar LaxmiBomb Firstlook
- Advertisement -

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి నటించిన కాంచన మూవీని హిందీలో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఫోక్స్ స్టార్ స్టూడియోస్, కేపీ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈమూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈమూవీలో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. లేడీ గెటప్ లో అక్షయ్ కుమార్ ఆకట్టుకుంటున్నాడు. వచ్చే ఏడాది జూన్ 5న ఈమూవీని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్ లో ఈమూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ‘లక్ష్మీ బాంబ్’ కూడా ఘన విజయం సాధిస్తుందన్ననమ్మకంతో సినిమా యూనిట్ ఉంది. మ‌రోవైపు అక్ష‌య్ ..రోహిత్ శెట్టి డైరెక్ష‌న్‌లో సూర్యవంశీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. 2020 ఈద్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -