ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైక్స్, కార్లు, బస్సులు,ట్రక్కులను చూసుంటాం..కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానం సైతం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈవీ ప్లాన్ నలుగురు ప్రయాణికులతో ఈవీ విమానం గాల్లోకి ఎగిరింది. అది కూడా కేవలం 8 డాలర్లు అంటే దాదాపు రూ. 694 ఖర్చుతో 130 కిలోమీటర్లు ప్రయాణించింది.
అమెరికాకు చెందిన కంపెనీ ఈ ప్రయోగాన్ని చేపట్టి విజయవంతంగా గమ్యస్థానానికి చేరింది. బీటా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ కైల్ క్లార్క్ మాట్లాడుతూ.. 100 శాతం ఎలక్ట్రిక్ విమానంగా పేర్కొన్నారు.
ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయానికి ప్రయాణికులతో ప్రయాణించాం.. 35 నిమిషాల్లో 70 నాటికల్ మైళ్ల దూరాన్ని అధిగమించాం అని తెలిపారు. ఇంజిన్లు, ప్రొపెల్లర్లు అసలు శబ్దం చేయవు. ప్రయాణీకులు విమాన సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. 2017లో స్థాపించిన బీటా టెక్నాలజీస్, ఇటీవల ఎలక్ట్రిక్ విమానాల కోసం 318 మిలియన్ డాలర్లను సేకరించింది. మొత్తం నిధులు 1 బిలియన్ డాలర్లకు పైగా చేరుకున్నాయి.
100 శాతం విద్యుత్ విమానం, తక్కువ ఖర్చుతో ఎగరగలదు.ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 250 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదు.
Also Read:TTD:జూలై 6 నుండి పవిత్రోత్సవాలు

