పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘విజయ భైరవ’. ఈ చిత్రం తొలి కాపీ రెడీ అయ్యింది. మే చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..’తమిళ్‌లో సంచలన విజయం సాధించిన ఇళయదళపతి విజయ్ ‘భైరవ’ చిత్రాన్ని ‘విజయ భైరవ’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబు నటన ఈ సినిమాకే హైలైట్. ప్రస్తుతం మొదటి కాపీ రెడీ అయ్యింది. మే ఎండింగ్‌కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము..’ అన్నారు.
విజయ్, కీర్తిసురేష్, జగపతిబాబు, సతీష్, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్ బాలాజీ, ఆపర్ణ వినోద్, పాప్రీ గోష్, హరిష్ ఉత్తమున్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎమ్. సుకుమార్, ఫైట్స్: అనల్ అరసు, పాటలు: వెన్నెలకంటి, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఆర్ట్: ఎమ్. ప్రభాకరన్, ఎడిటింగ్: ప్రవీణ్. కె. ఎల్, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్.