వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

5
- Advertisement -

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మరణించినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మొరిసే ప్రకటించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పులు జరిపిన వ్యక్తిని ‘మృగంతో’ పోలుస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక జారీ చేశారు.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు అవసరమని ట్వీట్ చేశారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

Also Read:రివాల్వర్ రీటా..పక్కా కమర్షీయల్

- Advertisement -