అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి

15
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఫోర్డిసీ ప‌ట్ట‌ణంలోని మాడ్ బుచ‌ర్ గ్రోస‌రీ సూప‌ర్‌ మార్కెట్‌లో ఓ ఉన్మాది జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడగా ఇందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు.

పోలీసుల‌తో జ‌రిగిన ఫైరింగ్‌లో అనుమానిత వ్య‌క్తి కూడా గాయ‌ప‌డిన‌ట్లు అర్కాన్సాస్ పోలీసు డైరెక్ట‌ర్ మైక్ హ‌గ‌ర్ తెలిపారు. కాల్పులు జ‌రిపిన వ్యక్తిని న్యూ ఎడిన్‌బ‌ర్గ్‌కు చెందిన 44 ఏళ్ల ట్రావిస్ యూజీన్ పోసీగా గుర్తించారు.

Also Read:The GOAT: విజ‌య్ బ‌ర్త్‌డే ట్రీట్‌..

- Advertisement -