విజయవాడలో భారీ అగ్నిప్రమాదం…

200
vijayawada
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో కోవిడ్ కేర్‌ సెంటర్‌ అయిన స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో షాట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరుగగా ఏడుగురు మృతిచెందారు. ఈ సెంటర్‌లో మొత్తం 40 మంది ఉండగా పలువురు పరిస్ధితి విషమంగా ఉంది.

దట్టమైన పొగ రావడంతో శ్వాస తీసుకోవడంలో కరోనా బాధితులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వెంటనే వారిని స్ధానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

హోటల్‌లో మంటలు చెలరేగే సరికి అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. కరోనా బాధితులను కాపాడేందుకు పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -