- Advertisement -
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో అగ్ని ప్రమాదం జరగింది. ఎనిమిది మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హారతి ఇస్తున్న సమయంలో పటాకులు పేల్చడానికి సిద్ధం చేసింది టీమ్.
పటాకులు పేల్చుతుండగా నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోటులో ఉన్న సుమారు పది మందికి గాయాలు కాగా కొంతమందిని యశోద ఆసుపత్రికి, మరికొందరిని గాంధీ ఆసుపత్రికి, సరోజినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన గణపతి. శరీరం 80 శాతం కాలిపోయినట్లు వైద్యుల వెల్లడించగా బాధితులని పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు.
Also Read:TTD:ఫీడ్‌బ్యాక్ సిస్టంతో భక్తులకు శ్రీవారి దర్శనం
- Advertisement -