ప్రముఖ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు 16 మందిపై విశాఖపట్నంలో తీవ్రమైన ఆరోపణలతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. బాధితురాలైన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని ప్రధాన ముఖ్యాంశాలువిశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో
రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది.
ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఒక హైకోర్టు అడ్వకేట్, కొందరు జర్నలిస్టులు, మరికొందరు సహకరిస్తూ తనను తీవ్రంగా బెదిరించారని, మానసిక ఒత్తిడికి గురిచేశారని తెలిపింది.ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన పోలీసులు సైబర్ నేరం, తీవ్ర బెదిరింపులు, కుట్ర కోణాల్లో కేసు నమోదు చేశారు.
Also Read:రూ.271 కోట్లకు పెంట్‌హౌస్..రికార్డు డీల్!
బాధితురాలు మహిళ కావడంతో పాటు వేధింపుల తీవ్రత దృష్ట్యా, తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం ఈ కేసును ఎంవీపీ పిఎస్ నుండి ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం మహిళా పోలీసులు ఈ వ్యవహారంపై లీగల్ ఆధారాలు సేకరిస్తూ విచారణ వేగవంతం చేశారు.

