వర్మకు నోటీసులు… ‘అదంతా ఫేక్‌’ అంటున్న వర్మ..

248
FIR Against RGV:hyderabad cyber crime police issued notices to ram ...
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేసిన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ లఘుచిత్రం పై గత కొన్నిరోజులుగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అయితే ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరుతో అశ్లీల చిత్రాన్ని నిర్మించారంటూ ఆర్జీవీపై ఫిర్యాదు అందుతున్నాయి.

దీంతో ఈ సినిమా విషయంలో వర్మపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ‘జీఎస్టీ’ పై ఫిర్యాదులు అందటంతో కేసు నమోదు చేసినట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా వర్మకు నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. నోటీసులకు స్పందించకుంటే అవసరమైతే అరెస్ట్ చేస్తామని అన్నారు.

FIR Against RGV:hyderabad cyber crime police issued notices to ram ...

మరోవైపు ‘జీఎస్టీ’ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించిన విమియా సంస్థ హైదరాబాద్ పోలీసుల ఆదేశాల మేరకు ఆ సౌకర్యాన్ని రద్దు చేసింది. కేవలం డబ్బులు చెల్లించి చూసే అవకాశాన్ని కల్పించగా, ఇప్పుడు అది కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాలం ద్వారా దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మూడు డాలర్లకు డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని రద్దు చేస్తున్నామంటూ విమియో సంస్థ తమకు అధికారికంగా రాసిన లేఖ అందిందని డీసీపీ రఘవీర్ తెలిపారు.

కాగా…ఈ షార్ట్ ఫిల్మ్‌ను భారత్‌లో నిలిపివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. అది ఫేక్ న్యూస్ అని తెలిపారు. కాపీరైట్‌ చర్యల్లో భాగంగా విమియో వెబ్ నుంచి మాత్రమే స్ట్రయిక్‌ ఫోర్స్‌ ఎల్‌ఎల్‌సీ నిర్మాతలు జీఎస్టీ షార్ట్ ఫిల్మ్‌ను తొలగించారని తెలిపారు. కాగా, ఈ సినిమా నిర్మాతలకు చెందిన అధికారిక వెబ్‌ సైట్ లో మాత్రం తమ జీఎస్టీ వీడియో అలాగే ఉందని వివరణ ఇచ్చారు.

- Advertisement -