బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివరాల్లోకి వెలితే.. రవీనా ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపల, ఆలయ ప్రాంగణంలో కెమేరాలు నిషిద్ధ ప్రాంతంలో ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారంటూ ఆలయ పాలకవర్గం ఆరోపించింది.
అయితే “ఆలయం లోపల ఎలాంటి షూటింగూ జరగలేదంటు వారి ఆరోపణలను రవీనా తోసిపుచ్చింది.. అందరూ స్థానికులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, కొంతమంది మీడియా మిత్రులు తమ మొబైళ్లలో నన్ను ఫోటోలు తీసుకున్నారు. వారే ఇష్టపడి నాతో సెల్ఫీలు దిగారు. అంతే…!” అని తనపై వచ్చిన ఆరోపణలకు రవీనా వివరణ ఇచ్చుకుంది. ఫోన్లు, కెమేరాల నిషిద్ధ ప్రాంతం గురించి తనకు ముందుగానే ఎవరూ చెప్పలేదని, అందువల్లే ఇదంతా జరిగిందని ఆమె వాపోయింది.
టెంపుల్ ప్రాంగణంలో టాండన్ బ్యూటీ టిప్స్ ఇస్తున్న వీడియోను ఎవరో షూట్ చేసి ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ వీడియో తమ దృష్టికి రావడంతో ఆమెపై లింగరాజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఆలయ అధికారి రాజీవ్ లోచన్ పరిదా తెలిపారు. గతంలో టాలీవుడ్లో బంగారుబుల్లోడు, ఆకాశవీధిలో చిత్రాలతో రవీనా తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించింది.