క్రికెటర్ పృథ్వీ షాకు జరిమానా

3
- Advertisement -

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సప్నా గిల్ కేసులో క్రికెటర్ పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించింది న్యాయస్థానం. ఫిబ్రవరి 15, 2023న అంధేరీలోని ఒక పబ్‌లో పృథ్వీ షాను సెల్ఫీ అడగగా తన స్నేహితులపై దాడి చేసి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు సప్నా గిల్.

దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో అంధేరీ కోర్టులో పిటిషన్ వేశారు గిల్. కాగా ఈ పిటిషన్‌కు కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేయకపోవడంతో.. పలుమార్లు అవకాశం ఇచ్చినా పృథ్వీ షా సమాధానం చెప్పడం లేదని రూ.100 జరిమానా విధించింది న్యాయస్థానం.

అలాగే కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకొక అవకాశం ఇచ్చింది కోర్టు.

Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!

- Advertisement -