టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుపై నేడు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడిగా సిద్దార్థ రెడ్డిని పేర్కొంటూ సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. తొలుత నాంపల్లి కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం హైకోర్టులో సవాలు చేయగా, శిక్షను రెండున్నరేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిద్దార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని శిక్ష పెంచాలని పిటిషన్ దాఖలు చేశారు.
గత ఏడాది నవంబరులో ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, నేడు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తుది నిర్ణయం వెల్లడించింది.ప్రత్యూష మృతి అప్పట్లో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందనే ఆరోపణలతో పెద్ద వివాదంగా మారింది. కేసును సీబీఐకి అప్పగించి సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాల న్యాయపోరాటానికి నేడు ఎండ్ కార్డ్ పడింది.
Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

