గాంధీభవన్ సాక్షిగా కాంగ్రెస్‌ నేతల కుమ్ములాట..

205
congress
- Advertisement -

గ్రేటర్ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమంలో బాహాబాహికి దిగారు మాజీ ఎంపీ వీహెచ్‌,అంబర్ పేట కాంగ్రెస్ నేత శ్రీకాంత్ అనుచరులు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంత్‌కు టికెట్ రాకుండా వీహెచక అడ్డుకున్నారని ఆరోపిస్తూ గొడవకు దిగారు.

ఈ క్రమంలో సహనం కొల్పోయిన వీహెచ్‌ వారిని పరుషదజాలంతో దుర్బాషలాడారు. దీంతో ఆగ్రహించిన శ్రీకాంత్ అనుచరులు వీహెచ్‌పై దాడికి ప్రయత్నించారు. వీహెచ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. వీహెచ్‌ వర్గీయులు కూడా దూసుకురావడంతో సమావేశం రచ్చ రచ్చైంది.

ఇరువర్గాల మధ్య తోపులాట,కుర్చీలతో, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలను సీనియర్‌ నేతలు శాతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని సీనియర్ నేతలు గాంధీభవన్‌ నుండి వెళ్లిపోయారు.

- Advertisement -