అట్టర్‌ ఫ్లాపైన కోదండరాం..కొలువుల కొట్లాట

249
congress
- Advertisement -

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని టీజేఏసీ చేపట్టిన కొలువుల కోసం కొట్లాట సభ అట్టర్ ఫ్లాపైంది. సభకు మద్దతిస్తామని ప్రకటించిన వివిధ పార్టీలు చేతులేత్తేయడంతో పాటు నిరుద్యోగుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సభ పేలవంగా సాగింది. సభ విజయవంతానికి నెల రోజుల ముందు నుంచే హంగుఆర్భాటాలతో టీజేఏసీ ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టారన్న అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

సరూర్ నగర్ వేదికగా  ఈ సభను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే మధ్యాహ్నం 2.45గంటల వరకు కూడా నిరుద్యోగులు సభాప్రాంగణానికి ఎక్కువగా రాలేదు. దీనికి తోడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ… గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో టీడీపీ,కాంగ్రెస్ నేతలు మొహం చాటేయాల్సిన పరిస్ధితివచ్చింది.

 fight for jobs flop show
ఈ సభకు హాజరైన వివిధ పార్టీల నేతలు నిరుద్యోగం గురించి మాట్లాకుండా కేవలం రాజకీయ ఆరోపణలు చేయడంపైనే దృష్టిపెట్టారు. కోదండరాం అయితే  సీఎం కేసీఆర్‌పై వ్యక్తి గత దూషణలకే ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంలో దృష్టిసారించిన కోదండరాం…సభలో అందరిని  ఏకం చేయడంలో విఫలమయ్యారు. ఇంత ఘోరంగా సభ విఫలమవుతుందని తాము ఊహించలేపోయామని పలువురు కాంగ్రెస్,టీడీపీ నేతలు  వ్యాఖ్యానించినచడం విశేషం.

కొలువుల కొట్లాట సభకు నిరుద్యోగుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో టీజేఏసీ నేతలు సైతం అసంతృప్తికి గురయ్యారు. ఇక నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన కోదండరాంపై టీఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

ఓ వైపు ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రిపరేషన్లలో తలమునకలై ఉంటే.. వారిని ఇబ్బంది పెట్టేలా..  కోదండరాం విష రాజకీయాలు చేయడం సరికాదని పలవురు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అధికారుల పంపకాల్లో ఎదురైన సమస్యల నుంచి మొదలు.. పొరుగు రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఛేదిస్తూ.. ఒక్కో అడుగూ ముందుకు వేస్తుంటే.. సహకరించాల్సింది పోయి.. అడుగడుగునా మోకాలడ్డటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కుట్ర పూరితమైన రాజకీయాల్లో పావులుగా మారి.. కోదండరాం లాంటి వాళ్ల విష కౌగిలిలో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలని సామాజికవేత్తలు కూడా పిలుపునిస్తున్నారు.

- Advertisement -