ట్రైలర్ ‘ఫిదా’ చేసింది…

282
Fidaa Theatrical Trailer
- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఫిదా మూవీ ట్రైలర్ వచ్చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్టయ్యాయి.

ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి టీజర్ వరకు ప్రేక్షకులను అలరించిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌తో ఫిదా చేసింది. వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న‌ కొన్ని సీన్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో వ‌రుణ్ అమెరికా అబ్బాయిగా క‌నిపించ‌నుండ‌గా, సాయి ప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయి పాత్ర పోషించింది. ఇద్ద‌రి మ‌ధ్య సాగే అంద‌మైన‌ ప్రేమాయణంతో ఈ చిత్రం తెరకెక్కుతుండ‌గా , శ‌క్తి కాంత్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -