ఫిదా 5డేస్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా..?

228
- Advertisement -

వ‌రుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఫిదా`. జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది.

ఫ్లాపుల్లో ఉన్న వ‌రుణ్ తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల ఇద్ద‌రికీ అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది ‘ఫిదా’ మూవీ. ఈ చిత్ర ఘన విజ‌యం ఆ ఇద్ద‌రి కెరీర్‌కి కావాల్సినంత బూస్ట్ దొరికిన‌ట్టు అయింది. ఈ సినిమా రిలీజైన తొలి మూడు రోజుల్లోనే దాదాపు 20 కోట్లు వ‌సూలు చేసి బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక ఐదు రోజుల‌కే పంపిణీదారులంద‌రినీ ఖుషీ చేస్తూ బ్రేక్ ఈవెన్ సాధించేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

Fidaa 5 Days Collections

హ్యాపీడేస్ ఈజ్ బ్యాక్‌! ఐదురోజుల్లో `ఫిదా` ఏకంగా 30 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇందులో 16.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్‌. ప్రింటు, ప‌బ్లిసిటీ అన్నీ క‌లిపి ఫిదా కోసం ఖ‌ర్చు చేసిన‌ది 18 కోట్లు. అంటే ఆ మేర‌కు ఇప్ప‌టికే బ‌డ్జెట్ రిక‌వ‌రీ అయిన‌ట్టే. ఇక‌నుంచి రాబోయేదంతా లాభ‌మేన‌ని ట్రేడ్ నిపుణుల గ‌ణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి దిల్‌ రాజు హ‌వా న‌డుస్తోంది. మ‌రో విజ‌యం త‌న ఖాతాలో ప‌డింది.మరి శేఖర్‌ క‌మ్ముల‌కు, వ‌రుణ్‌తేజ్‌కి కూడా కెరీర్‌ప‌రంగా ఈ సినిమా కలిసొచ్చిందనే చేప్పాలి.

- Advertisement -