ఫిదా 2లో ఖుషీ కళ్యాణ్ !

311
Fidaa 2 with Pawan Kalyan
Fidaa 2 with Pawan Kalyan
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ‘ఫిదా’ కలెక్షన్స్ పరంగా సృట్టిస్తున్న రికార్డులు అందరి అంచనాలను తలక్రిందులు చేస్తున్నాయి. ఈ మూవీకి ఇంకా కలక్షన్స్ బాగా వస్తున్న నేపధ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల ఈసినిమా వెనుక షాడో లా పనిచేసిన పవన్ విషయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు.

వాస్తవానికి తాను ఈసినిమాను పవన్ కళ్యాణ్ ను హీరోగా ఊహించుకుని ఈకథను వ్రాసిన విషయాన్ని బయట పెడుతూ “అసలు ఫిదా సినిమాను పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా. మొదట్నుంచి ఇందులో పవన్ నే ఊహించుకున్నాను. దిల్ రాజుకు కథ చెప్పినప్పుడు కూడా పవన్ అయితే బాగుంటుందని చెప్పాను” అని అంటూ కథ రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ కల్యాణ్ తనను నడిపించిన విషయాలను బయట పెట్టాడు శేఖర్ కమ్ముల.

అయితే ఫిదా సినిమాకు పవన్ కళ్యాణ్‌ కూడా ఫిదా అయ్యాడట. దీంతో శేఖర్ కమ్ముల ఈ సారి స్ట్రయిట్‌గా పవన్‌తోనే సినిమాతోనే సినిమా తీయాలని ఆలోచిస్తున్నాడట. అది కూడా ఫిదా 2 అని సమాచారం. దిల్‌ రాజు కూడా ఫిదా 2ను నిర్మించేందుకు ఓ ఇంటర్వ్యూలో ఓకే చెప్పేశాడు. ఇందులో హీరోయిన్‌గా కూడా సాయిపల్లవినే తీసుకుంటానని కూడా దిల్ రాజు ఒక సంధర్బంలో వెల్లడించాడు. పవన్‌ కళ్యాణ్ కు తొలిప్రేమ, ఖుషీ లాంటి హిట్‌ అవ్వాలని శేఖర్ కమ్ముల ఫిక్సయ్యాడు. పవన్ నటించిన ‘ఖుషి’ సినిమా ఛాయలు, ఫిదా సెకెండాఫ్‌లో కనిపిస్తాయని శేఖర్ కమ్ముల అన్న సంగతి తెలిసిందే.

- Advertisement -